Category: Editor’s Picks

In the vibrant WordPress ecosystem, AF Themes stands as a beacon of innovation and excellence. Our popular themes — CoverNews, Morenews, ChromeNews, Newsphere, and Shopical — alongside our powerful plugins — WP Post Author, Blockspare, and Elespare — serve as the building blocks of your digital journey.

  • సిరిసిల్లలో సీఎం పర్యటనతో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్‌: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
    , , ,

    సిరిసిల్లలో సీఎం పర్యటనతో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్‌: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    సిరిసిల్ల గులాబీ నేతల్లో మొదలైన గుబులు. కల్వకుంట్ల భూ కబ్జాలపై ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా తీయాలి. ఈనెల 30న లక్ష మందితో సీఎం బహిరంగ సభ. సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ సక్సెస్ చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌన్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది…

    Continue Reading

  • సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం దక్కెదేవరికో..?
    , , , , ,

    సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం దక్కెదేవరికో..?

    త్వరలో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం. కాలికానున్న ఐదు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు..! సిరిసిల్ల పీఠంపైనే అందరి నేతల కన్ను. బడానేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : నామినేటెడ్ పదవుల పందేరం మరోసారి కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, పాలకవర్గాలను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త నియామకాలపై పార్టీలో చర్చ మొదలైంది.…

    Continue Reading

  • సైఫాబాద్‌ పీఎస్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
    , , , ,

    సైఫాబాద్‌ పీఎస్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

    సీసీటీవీ ఫుటేజ్‌ భద్రపరచాలని పోలీసులకు సూచన. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం. సిరివెలుగు, హైదరాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాడి జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్‌లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్‌ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌ ముదిరాజ్‌పై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాడి జరిగిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ…

    Continue Reading

  • పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్
    , , , ,

    పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్

    ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఆకలిని తరిమి.. అక్షరానికి అండగా నిలుస్తాం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో రూ.8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభం. 49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం. సిరివెలుగు, కరీంనగర్ : పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి…

    Continue Reading

  • సిరిసిల్లాకు సీఎం రేవంత్..!
    , , , , , ,

    సిరిసిల్లాకు సీఎం రేవంత్..!

    ఈ నెలాఖరులోగా సిరిసిల్లలో సీఎం టూర్? బిఆర్ఎస్ ఎత్తుగడలకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. కేటీఆర్ కంచుకోటలో బలప్రదర్శనకు రంగం సిద్ధం. సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభకు సన్నాహాలు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈనెల 30న సభ. ఆ తరువాత సిద్దిపేట, గజ్వేల్ లోనూ. బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా వ్యూహం. సీఎం సిరిసిల్ల టూర్ పై పెరుగుతున్న ఉత్కంఠ. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. సిరివెలుగు, తెలంగాణ బ్యూరో, రాజన్న సిరిసిల్ల: అతి త్వరలో సిరిసిల్లలో సీఎం…

    Continue Reading

  • ఎన్నికల కక్షలు.. కర్రల ఘర్షణ
    , , ,

    ఎన్నికల కక్షలు.. కర్రల ఘర్షణ

    ఇరు వర్గాల పరస్పర దాడులు. దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల వెంకంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత. పద్మశాలి యువజన సంఘ ఎన్నికల విభేదాలే కారణమా? సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తండ్రి, కొడుకులు కూడా గాయపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేడి.. ఘర్షణకు దారి? గత…

    Continue Reading

  • తల్లిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు: తమ్ముడిపై హత్యాయత్నం కేసులో తీర్పు
    , , ,

    తల్లిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు: తమ్ముడిపై హత్యాయత్నం కేసులో తీర్పు

    సిరివెలుగు కరీంనగర్‌ : ఆస్తి వివాదంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన అగుర్ల లింగయ్యకు ఫ్యామిలీ కోర్టు, 4వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.10 వేల జరిమానా కూడా విధించింది. 2022 అక్టోబర్‌ 24న ఇరుకుల్ల గ్రామంలో తనకు రావాల్సిన భూమి వాటాను తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలని తల్లి, తమ్ముడితో లింగయ్య గొడవకు దిగాడు. ఆగ్రహంతో రోకలిబండతో వారి తలలపై…

    Continue Reading

  • భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
    , , ,

    భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

    కొత్తపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. సిరివెలుగు కొత్తపల్లి: వినాయక నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద చేపడుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గతంలో నిమజ్జనం చేసిన స్థలం విషయంలో పట్టాదారు కోర్టును ఆశ్రయించడంతో ఈసారి మరో ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కొత్తగా ఎంపిక చేసిన నిమజ్జన స్థలం విస్తీర్ణం ఎక్కువగా ఉండేలా…

    Continue Reading

  • కొత్తకొండలో మంత్రి పొన్నం నక్షత్ర మాల విరమణ
    , ,

    కొత్తకొండలో మంత్రి పొన్నం నక్షత్ర మాల విరమణ

    27 రోజుల నక్షత్ర దీక్ష పూర్తి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు. సిరివెలుగు, హనుమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 27 రోజుల నక్షత్ర దీక్షను పూర్తి చేసి నక్షత్ర మాల విరమణ చేశారు. ఇరుముడితో కొత్తకొండ కొండపైకి చేరుకున్న మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో నక్షత్ర మాల విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా…

    Continue Reading

  • మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం
    , ,

    మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం

    వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రతో అపూర్వ పట్టుచీర. 102 మంది ఋషుల పేర్లు.. 102 గోత్రనామాలు.. 25 చారిత్రక చిత్రాలు. 45 రోజుల శ్రమతో చేనేత మగ్గంపై ఆధ్యాత్మిక కళాఖండం. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: చేనేత మగ్గంపై దారం మాత్రమే కాదు.. చరిత్రను కూడా నేయవచ్చని మరోసారి నిరూపించారు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్. మగ్గంపై తనదైన సృజనాత్మకతతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఆయన.. తాజాగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి…

    Continue Reading

error: Content is protected !!