ఎన్నికల కక్షలు.. కర్రల ఘర్షణ

ఇరు వర్గాల పరస్పర దాడులు. దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల వెంకంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత. పద్మశాలి యువజన సంఘ ఎన్నికల విభేదాలే కారణమా? సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తండ్రి, కొడుకులు కూడా గాయపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేడి.. ఘర్షణకు దారి? గత…

ఇరు వర్గాల పరస్పర దాడులు.

దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలు.

సిరిసిల్ల వెంకంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.

పద్మశాలి యువజన సంఘ ఎన్నికల విభేదాలే కారణమా?

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తండ్రి, కొడుకులు కూడా గాయపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల వేడి.. ఘర్షణకు దారి?

గత నెలలో జరిగిన పద్మశాలి యువజన సంఘం ఎన్నికల సందర్భంగా ఏర్పడిన విభేదాలు ఇంకా చల్లారలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెంకంపేటలో జరిగిన ఘర్షణకు ఆ ఎన్నికల సమయంలో ఏర్పడిన పాత కక్షలే కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఘర్షణకు పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇంటిపై దాడితో మొదలై.. కర్రలతో దాడుల వరకు.

పద్మశాలి యువజన సంఘం కోశాధికారి చందు ఇంటిపై కొందరు యువకులు దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వంగరి అంబదాస్, వంగరి చందు, జగదీష్, రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. అంబదాస్, చందు తలలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

రంగంలోకి పోలీసులు.

ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు వ్యక్తిగత ఘర్షణలకు దారితీయడం పట్ల స్థానికంగా చర్చ సాగుతోంది. తాజా ఘటనతో వెంకంపేటలో మళ్లీ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!