కాలరాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.
మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజ.
సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 11 (లెవెన్) టైగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో శనివారం నవరాత్రుల ఏడో రోజు అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి గాజుల పూజ, కుంకుమార్చన, పుష్పార్చనతో పాటు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీ పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ వేడుకల్లో కాలనీవాసులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలరాత్రి దేవి విశిష్టతదుర్గాదేవి తొమ్మిది రూపాల్లో ఏడో రూపమైన కాలరాత్రి దేవిని ఆరాధించడం నవరాత్రుల్లో ప్రత్యేకతగా భావిస్తారు. చీకటి, అజ్ఞానం, భయాలను తొలగించి శుభాలను ప్రసాదించే తల్లిగా కాలరాత్రి దేవిని భక్తులు కొలుస్తారు. శారదా నవరాత్రుల్లో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిని పూజించడం ద్వారా విద్య, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.











