పదేళ్ల తర్వాత ఎన్నికలు. గుర్తింపు పత్రం అందజేతతో సందడి.
సిరివెలుగు, సిరిసిల్ల: ఆర్టీసీలో పదేళ్ల తర్వాత నిర్వహించిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి (EU–TMU–NMU)కి గుర్తింపు లభించిన సందర్భంగా శనివారం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీఎంయూ జెండాను ఆవిష్కరించి, బాణాసంచా కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి అధికారిక గుర్తింపు పత్రం అందజేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్మికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షుడు జీపీ సింగ్, నాయకులు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. మల్లేశ్, డిపో అధ్యక్షులు వి. రాజేందర్, కే. బాబాణయ్య, డిపో కార్యదర్శులు ఎల్. రాంరెడ్డి నాయక్, జేఎస్ఎన్ రావు, చీఫ్ అడ్వైజర్ బి. శ్రీనివాస్, గ్యారేజ్ కార్యదర్శులు సంతోష్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.











