సిరిసిల్లలో సీఎం పర్యటనతో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్‌: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల గులాబీ నేతల్లో మొదలైన గుబులు. కల్వకుంట్ల భూ కబ్జాలపై ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా తీయాలి. ఈనెల 30న లక్ష మందితో సీఎం బహిరంగ సభ. సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ సక్సెస్ చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌన్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది…

సిరిసిల్ల గులాబీ నేతల్లో మొదలైన గుబులు.

కల్వకుంట్ల భూ కబ్జాలపై ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా తీయాలి.

ఈనెల 30న లక్ష మందితో సీఎం బహిరంగ సభ.

సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ సక్సెస్ చేయాలని పిలుపు.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌన్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది శ్రీనివాస్‌తో పాటు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో గులాబి లీడర్ల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. నేతన్నల జీవితాల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏమిటో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించామని, నేతన్నలకు సంబంధించిన సుమారు రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రస్తావించారు. నేతన్నలకు అండగా నిలవడానికి సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా చెల్లించబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదో ప్యాకేజీ, ఎగువ మానేరు, కాలువల నిర్మాణం, సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్లక్ష్యం తదితర అంశాలపై కూడా వారు గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.కేటీఆర్‌ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు కొలగొట్టి కల్వకుంట్ల కుటుంబం కట్టిన ఫామ్ లపై ఫామ్ హౌస్ ఫైల్స్ అనే సినిమా తీసే అవసరం ఉందని, అలాగే ధరణి పోర్టల్, జీవో 22ఏ లను అడ్డుపెట్టుకొని కేటీఆర్ అనుచరులు సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో సీఎం హోదాలో రాజన్న దర్శనానికి వచ్చిన కేసీఆర్ ఏటా రెండు వందల కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తానని రాజన్నకే శఠకోపం పెట్టాడని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 250 కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్లలో సీఎం పర్యటన అనంతరం సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులు, గతంలో జరిగిన పరిణామాలపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించేందుకు సభ వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రంగినేని ట్రస్ట్ వద్ద నిర్వహించబోయే సీఎం భారీ బహిరంగ సభ స్థలాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే లతో కలిసి పరిశీలించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయాల ఛైర్మెన్ నాగుల సత్యనారాయణగౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణకాంగ్రెస్ అధ్యక్షులు, సూర దేవరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, సీనియర్ చక్రధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ, ఫ్యాక్స్ ఛైర్మెన్లు, కౌన్సిలర్ లు మండలాల అధ్యక్షులతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!