కవల మగపిల్లల జననం.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అరుదైన ఆనందకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్లోని జూబ్లీ నగర్కు చెందిన ఊర్మిళ సాధారణ ప్రసవం ద్వారా కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ప్రసవం అనంతరం తల్లితో పాటు ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ సుచేతలక్ష్మి, డాక్టర్ సుగుణ పర్యవేక్షణలో డాక్టర్ ప్రతిభ ప్రసవం నిర్వహించారు. నర్సింగ్ ఇన్చార్జి ఉమ, నర్సింగ్ ఆఫీసర్లు మమత, దీప సేవలందించారు.సాధారణ ప్రసవం ద్వారా కవల మగపిల్లలు జన్మించడంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందించిన వైద్య సేవల పట్ల సిబ్బందిని ప్రశంసించారు.











