భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కొత్తపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. సిరివెలుగు కొత్తపల్లి: వినాయక నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద చేపడుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గతంలో నిమజ్జనం చేసిన స్థలం విషయంలో పట్టాదారు కోర్టును ఆశ్రయించడంతో ఈసారి మరో ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కొత్తగా ఎంపిక చేసిన నిమజ్జన స్థలం విస్తీర్ణం ఎక్కువగా ఉండేలా…

కొత్తపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.

సిరివెలుగు కొత్తపల్లి: వినాయక నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద చేపడుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గతంలో నిమజ్జనం చేసిన స్థలం విషయంలో పట్టాదారు కోర్టును ఆశ్రయించడంతో ఈసారి మరో ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కొత్తగా ఎంపిక చేసిన నిమజ్జన స్థలం విస్తీర్ణం ఎక్కువగా ఉండేలా చూడాలని, 500కు పైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జనం అనంతరం వాహనాలు త్వరగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూమి విషయంలో సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం స్థలాన్ని వినియోగించాలని నరేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్‌, మున్సిపల్‌ సిబ్బంది, కాంట్రాక్టర్‌ సతీష్‌, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!