Category: తాజా వార్తలు
-

పేదలకు మెరుగైన వైద్యం.. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్సలకు సీ-ఆర్మ్ యంత్రం. వినికిడి పరీక్షలు, ప్రత్యేక చికిత్సలకు ఏర్పాట్లు.పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆది శ్రీనివాస్. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, వేములవాడ: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తొమ్మిదో…
-

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. విద్యార్థులకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే దిశానిర్దేశం
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన వంద రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి విద్యా సంవత్సరంలో వంద రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని…
-

డాక్టర్ మనోహర్ ఆసుపత్రిలో నేడు ఉచిత కాలేయ పరీక్షల శిబిరం
నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు. సిరివెలుగు, వేములవాడ: కాలేయ ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, కాలేయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించేందుకు వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కాలేయ ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘లివర్ ఫరెవర్ క్యాంప్’ పేరుతో నిర్వహించే ఈ శిబిరంలో అత్యాధునిక ఫైబ్రోస్కాన్ యంత్రం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా…
-

పోషకాహారంతోనే పిల్లల సమగ్ర అభివృద్ధి: డిడబ్ల్యుఓ లక్ష్మీరాజం
తొలి 1,000 రోజులు అత్యంత కీలకం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం ఎంతో కీలకమని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అన్నారు. గురువారం జాతీయ పోషణ మాసం సందర్భంగా సిరిసిల్లలోని కల్యాణలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ మేళా కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, ఏఎంసీ చైర్మన్లు, సిడిపిఓ సబిత, ఇతర అధికారులతో కలిసి ఆయన జ్యోతి ప్రొద్దున చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు…
-

న్యాయ విజ్ఞాన సదస్సుతో ప్రజల్లో అవగాహన పెంపు: ఆడెపు వేణు
చట్టాలపై అవగాహనతోనే హక్కులను కాపాడుకోగలం. సిరివెలుగు, సిరిసిల్ల: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికీ సులభంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడెపు వేణు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన అవసరమని, చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే వ్యక్తి తన…
-

రీ సర్వేలో భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: భూభారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వేలో క్షేత్రస్థాయి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో సర్వే కోసం 18 రోవర్ యంత్రాలు అందుబాటులో…
-

ఆర్టీఓ అధికారి పేరుతో మోసం
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పేరుతో రూ.4,200 కాజేత. నిందితుడి అరెస్ట్, రిమాండ్. సిరివెలుగు, వేములవాడ: ఆర్టీఓ అధికారినంటూ ఫోన్లో పరిచయం చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పేరుతో డబ్బులు కాజేసిన వ్యక్తిని వేములవాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన్నట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ వివరాలు తెలిపారు. గురువారం వేములవాడ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. హన్మాజిపేటకు చెందిన శ్రీనివాస్కు జూన్ 1న ఫోన్ చేసిన నిందితుడు…
-

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: సైకాలజిస్ట్ పున్నంచందర్
పని ఒత్తిడి, ఆందోళనను నిర్లక్ష్యం చేయొద్దు. సిరివెలుగు, సిరిసిల్ల: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించారు. పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యలు, నిద్రలేమి, అధిక ఆలోచనలు, ఆందోళన వంటివి మానసిక…
-

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
సమన్వయ సమావేశం. గోడపత్రిక ఆవిష్కరణ. సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సమక్షంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సమావేశంలో చర్చించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన…
Latest News
You May Have Missed













