సిరిసిల్ల కాంగ్రెస్ లో వర్గపోరు!

మరోసారి బహిర్గవతమవుతున్న విభేదాలు. ఎమ్మెల్సీ టికెట్ కోసం మల్లగుల్లాలు. అధిష్టానాన్ని కలిసిన జిల్లా ముఖ్యనేత? మహిళా నేతను రంగంలోకి దింపిన మరోవర్గం. టికెట్ నాకంటే నాకంటూ మరికొంత మంది నేతలు. అధిష్టానానికి తలనొప్పిగా మారిన వైనం. అసలు సిరిసిల్లలో సీఎం ప్రకటన ఏమిటి? సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్ల పర్యటనలో భాగంగా నిరహించిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. సిఎం చేసిన…

మరోసారి బహిర్గవతమవుతున్న విభేదాలు.

ఎమ్మెల్సీ టికెట్ కోసం మల్లగుల్లాలు.

అధిష్టానాన్ని కలిసిన జిల్లా ముఖ్యనేత?

మహిళా నేతను రంగంలోకి దింపిన మరోవర్గం.

టికెట్ నాకంటే నాకంటూ మరికొంత మంది నేతలు.

అధిష్టానానికి తలనొప్పిగా మారిన వైనం.

అసలు సిరిసిల్లలో సీఎం ప్రకటన ఏమిటి?

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్ల పర్యటనలో భాగంగా నిరహించిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. సిఎం చేసిన ఎమ్మెల్సీ టికెట్టుతో పార్టీలో వర్గపోరు మొదలైనట్లు తెలుస్తోంది. సిరిసిల్ల కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనలో చేసిన ఎమ్మెల్సీ ప్రకటన ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నేతను ఎమ్మెల్సీగా మండలికి పంపాలంటూ సీఎం చేసిన ప్రకటనతో ఆశావహుల్లో పోటీ మొదలైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

అధిష్టానాన్ని కలిసిన జిల్లా ముఖ్యనేత!.

జిల్లా స్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత ఇప్పటికే అధిష్ఠానం పెద్దలను కలిసినట్లు సమాచారం. తనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మరోవైపు మహిళా నేతను రంగంలోకి దింపేందుకు మరోవర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక సిరిసిల్లకు చెందిన పలువురు నేతలు సైతం ఎమ్మెల్సీ అవకాశం తమకే దక్కాలంటూ పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది నేతలు తమకే మద్దతు తెలపాలని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పెద్దలకు ఉదయం అల్పాహారం, మధ్యాన్నం విందులు, సాయంత్రం దావత్ లు ఇస్తున్నట్లు బహిరంగ చర్చ కొనసాగుతోంది. దీంతో సీఎం ప్రకటన కాంగ్రెస్‌లోని అంతర్గత సమీకరణాలను మరోసారి కదిలించినట్లయింది.

అసలు సీఎం చెప్పిందేంటి?

సెప్టెంబర్‌ 30న సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని శాసనమండలికి పంపుతామని ప్రకటించారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఎవరు గెలిచి వచ్చినా.. వారికి మంత్రి పదవి ఇస్తానని సిరిసిల్ల బహిరంగ సభ సాక్షిగా సీఎం హామీ ఇచ్చారు. అయితే సిరిసిల్ల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ ప్రత్యేకంగా ప్రకటించలేదు. కాగా సిరిసిల్ల పద్మశాలి నేతలు మాత్రం సిరిసిల్లకే ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎవరి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు.

ఆశావహుల లాబీయింగ్‌ రాజకీయాలు!.

సీఎం ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఆశావహుల కదలికలు పెరగగా.. సిరిసిల్లలో మాత్రం స్థానిక నేతల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఆశావహుల లాబీయింగ్‌ రాజకీయాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం హామీ నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ సిరిసిల్ల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి దక్కుతుందా.. లేక రాష్ట్రంలోని ఇతర జిల్లాల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి దక్కుతుందా… అనేది ఇప్పుడు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఎమ్మెల్సీ టికెట్‌ కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు చివరకు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!