డాక్టర్ మనోహర్ ఆసుపత్రిలో నేడు ఉచిత కాలేయ పరీక్షల శిబిరం

నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు. సిరివెలుగు, వేములవాడ: కాలేయ ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, కాలేయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించేందుకు వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కాలేయ ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘లివర్ ఫరెవర్ క్యాంప్’ పేరుతో నిర్వహించే ఈ శిబిరంలో అత్యాధునిక ఫైబ్రోస్కాన్ యంత్రం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా…

నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు.

సిరివెలుగు, వేములవాడ: కాలేయ ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, కాలేయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించేందుకు వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కాలేయ ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘లివర్ ఫరెవర్ క్యాంప్’ పేరుతో నిర్వహించే ఈ శిబిరంలో అత్యాధునిక ఫైబ్రోస్కాన్ యంత్రం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. నేడు ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు ఎక్కువగా ఉండటం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ కె. మనోహర్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరానికి ముందస్తు వివరాలు, అపాయింట్‌మెంట్‌ కోసం 8801333469, 9000584510 నంబర్లను సంప్రదించాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!