Author: sirivelugu
-

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్‌బాబు
నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన. సిరివెలుగు, సిరిసిల్ల : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని మానేరు నది తీరంలోని బ్రిడ్జి వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్‌బాబు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు…
-

రాజన్న కోడె ప్రసాదం.. రైతులకు వరం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణి ప్రారంభం. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, వేములవాడ : రాజన్నకు భక్తులు సమర్పించిన కోడెలు ఇక సన్న, చిన్నకారు రైతులకు ‘రాజన్న ప్రసాదం’గా చేరుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భక్తుల మొక్కులతో ఆలయానికి చేరిన కోడెలను గోశాలలో సంరక్షిస్తూ.. అర్హులైన నిరుపేద రైతులకు జతలుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం తిప్పాపూర్ గోశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసిఆయన ముఖ్య…
-

వినాయకుడికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక పూజలు
ఐడీఓసీలో మట్టి గణపతి ప్రతిష్ఠ. పాల్గొన్న ఆయా జిల్లా అధికారులు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : వినాయక చవితి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.జిల్లా ప్రజలంతా వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్,…
-

భక్తిశ్రద్ధలతో గణనాథునికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూజలు
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణహిత గణేష్ ఉత్సవాలకు పిలుపు సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ప్రజలకు…
-

ఎన్నికల కక్షలు.. కర్రల ఘర్షణ
ఇరు వర్గాల పరస్పర దాడులు. దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల వెంకంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత. పద్మశాలి యువజన సంఘ ఎన్నికల విభేదాలే కారణమా? సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తండ్రి, కొడుకులు కూడా గాయపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేడి.. ఘర్షణకు దారి? గత…
-

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పిట్టల భూమేష్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి. సిరివెలుగు, వేములవాడ: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు, న్యాయవాది పిట్టల భూమేష్ డిమాండ్ చేశారు. ముదిరాజ్, మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలోనిర్వహించిన భారీ మహార్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 50…
-

కాంగ్రెస్‌ను బలోపేతానికి బూత్ స్థాయి నుంచే పార్టీకి పటిష్ట పునాది వేయాలి: సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు
సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వార్డు అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి కీలకమన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డుల అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం…
-

మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: బిఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా
సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు…
-

చరిత్రను విస్మరిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిరిసిల్ల జిల్లా…
-

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి పోలీసుల కృషి: అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జాతీయ లోక్ అదాలత్‌కు జిల్లాలో విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పెద్ద సంఖ్యలో కేసులు కొలిక్కి వచ్చాయి. లోక్ అదాలత్ ద్వారా మొత్తం 228 కేసులు, 56 పెట్టీ కేసులు, 823 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు, 11,456 ట్రాఫిక్ చలాన్ కేసులు, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు.…
Latest News
You May Have Missed












