కాంగ్రెస్‌ను బలోపేతానికి బూత్‌ స్థాయి నుంచే పార్టీకి పటిష్ట పునాది వేయాలి: సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వార్డు అధ్యక్షులు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు పార్టీకి కీలకమన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డుల అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం…

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వార్డు అధ్యక్షులు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు పార్టీకి కీలకమన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డుల అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని దేవరాజు సూచించారు. అక్టోబర్‌ 7 వరకు ఉన్న గడువులోగా వార్డుల పరిధిలో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఫారాలను పూర్తి చేసి సమర్పించారా లేదా అనే విషయాన్ని ప్రతి వార్డు అధ్యక్షుడు పరిశీలించాలని తెలిపారు. ప్రతి వార్డు అధ్యక్షుడు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ బూత్‌పై పూర్తి అవగాహన, పట్టు కలిగి ఉండాలన్నారు. ఓటర్ల జాబితా సవరణను బాధ్యతగా తీసుకుని పనిచేస్తే భవిష్యత్‌ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నా, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నా బూత్‌ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసముందన్నారు. దళితుల పట్ల అవమానకరంగా వ్యవహరించే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. దళితులు, కాంగ్రెస్‌ శ్రేణులు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, ప్రధాన కార్యదర్శులు నీలి రవీందర్‌, నేదురు లక్ష్మణ్‌, వెంగళ అశోక్‌, ఉపాధ్యక్షుడు శ్రీరాముల వెంకటేశం, కార్యదర్శి బైరగోని రమేష్‌, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, నాయకులు వెంగళ లక్ష్మీ నరసయ్య, కంసాల మల్లేశం, మల్యాల నాగరాజు, వార్డు అధ్యక్షులు ఆడపు ప్రసాద్‌, కొమ్ము త్యాగరాజు, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!