Author: sirivelugu
-

ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
అధ్యక్షుడిగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తాడుక సాయికుమార్, కోశాధికారిగా డాక్టర్ ఎ. జైల్సింగ్. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన బాధ్యుల ఎంపిక జరగగా, జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చీకోటి సంతోష్కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్లకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్…
-

ఫోర్జరీ సంతకాలతో కళాశాల విక్రయం? కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్ ఆరోపణ!
ఎస్కేడిఆర్ జూనియర్ కళాశాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలను తమకు తెలియకుండా విక్రయించారని, సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించారని ఆరోపిస్తూ కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. భాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. వెంకంపేటకు దిడ్డి శ్రీనివాస్ వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్గా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్…
-

వివాదాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ముప్పు కాకుండా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజీ చేయదగిన పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.…
-

మోదీ ప్రజాసేవయే స్ఫూర్తిదాయకం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానమే ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ జిల్లా కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.…
-

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏచూరి: సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్
సిరివెలుగు, సిరిసిల్ల టౌన్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏచూరి అని సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ సీతారాం అన్నారు. శనివారం ఏచూరి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మృతులాల్ శుక్ల కార్మిక భవన్లో సీపీఎం నాయకులతో కలిసి ఆయన ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఏచూరి చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ…
-

తల్లిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు: తమ్ముడిపై హత్యాయత్నం కేసులో తీర్పు
సిరివెలుగు కరీంనగర్ : ఆస్తి వివాదంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన అగుర్ల లింగయ్యకు ఫ్యామిలీ కోర్టు, 4వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.10 వేల జరిమానా కూడా విధించింది. 2022 అక్టోబర్ 24న ఇరుకుల్ల గ్రామంలో తనకు రావాల్సిన భూమి వాటాను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని తల్లి, తమ్ముడితో లింగయ్య గొడవకు దిగాడు. ఆగ్రహంతో రోకలిబండతో వారి తలలపై…
-

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి
కొత్తపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. సిరివెలుగు కొత్తపల్లి: వినాయక నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద చేపడుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గతంలో నిమజ్జనం చేసిన స్థలం విషయంలో పట్టాదారు కోర్టును ఆశ్రయించడంతో ఈసారి మరో ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కొత్తగా ఎంపిక చేసిన నిమజ్జన స్థలం విస్తీర్ణం ఎక్కువగా ఉండేలా…
-

ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించి భద్రపరచాలి: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను డిజిటలైజ్ చేయాలి. సిరివెలుగు, కరీంనగర్: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జ్ఞాన్ భారతం మిషన్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో తాళపత్రాలు, లోహాలు, రాతిపై లిఖించిన పురాతన గ్రంథాలు, పద్యాలు, శాసనాలను సేకరించాలని సూచించారు.…
-

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం
సిరివెలుగు, కరీంనగర్ : తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు. హుజురాబాద్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని విమర్శించారు.…
-

మట్టి వినాయకులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి
సిరివెలుగు సిరిసిల్ల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలు నీటిలో త్వరగా కరగకపోవడంతో పర్యావరణానికి…
Latest News
You May Have Missed












