లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి పోలీసుల కృషి: అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జాతీయ లోక్‌ అదాలత్‌కు జిల్లాలో విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పెద్ద సంఖ్యలో కేసులు కొలిక్కి వచ్చాయి. లోక్‌ అదాలత్‌ ద్వారా మొత్తం 228 కేసులు, 56 పెట్టీ కేసులు, 823 డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, 11,456 ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు, 75 సైబర్‌ క్రైమ్‌ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు.…

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జాతీయ లోక్‌ అదాలత్‌కు జిల్లాలో విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పెద్ద సంఖ్యలో కేసులు కొలిక్కి వచ్చాయి. లోక్‌ అదాలత్‌ ద్వారా మొత్తం 228 కేసులు, 56 పెట్టీ కేసులు, 823 డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, 11,456 ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు, 75 సైబర్‌ క్రైమ్‌ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో బాధితులకు ఊరట లభించేలా రూ.2,79,030 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన ఈ మొత్తాన్ని సంబంధిత బాధితులకు అందించేందుకు న్యాయపరమైన చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. “రాజీ మార్గమే రాజమార్గం” అనే భావనతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించడంలో చొరవ చూపిన కోర్టు మానిటరింగ్‌ ఎస్‌ఐ శ్రావణ్‌ యాదవ్‌, కోర్టు మానిటరింగ్‌ కానిస్టేబుళ్లు, వివిధ పోలీస్‌ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. లోక్‌ అదాలత్‌ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా చేసుకోవచ్చని ఆయన సూచించారు

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!