చరిత్రను విస్మరిస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిరిసిల్ల జిల్లా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆదివారం బీజేపీ నాయకులు శుద్ధి చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ పోలో అనంతరం నిజాం లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు.

ఈ చారిత్రక ఘట్టాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరని, విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకున్న కేసీఆర్‌ సైతం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా విలీన దినోత్సవంగా పరిమితం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గోపి స్పష్టం చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మహనీయుల త్యాగాలు, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు చాటిచెబుతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్‌, లింగంపల్లి శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గొప్పడి సురేందర్‌రావు, జిల్లా అధికార ప్రతినిధులు నవీన్‌ యాదవ్‌, రాజాసింగ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి, పల్లె గ్రామ సర్పంచ్‌ రాగుల రాజురెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ సాబీర్‌, ధార్మిక సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రామ్‌ ప్రసాద్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు కొండ నరేష్‌, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్‌, వేములవాడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ వంగల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!