ఐడీఓసీలో మట్టి గణపతి ప్రతిష్ఠ.
పాల్గొన్న ఆయా జిల్లా అధికారులు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : వినాయక చవితి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.జిల్లా ప్రజలంతా వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, శ్రీకాంత్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీవైఎస్ఓ రాందాస్, వేములవాడ తహసీల్దార్ జయంత్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











