నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన.
సిరివెలుగు, సిరిసిల్ల : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని మానేరు నది తీరంలోని బ్రిడ్జి వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్బాబు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో సిరిసిల్ల టౌన్, రూరల్ సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.











