Category: తాజా వార్తలు

  • మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం
    , ,

    మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం

    వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రతో అపూర్వ పట్టుచీర. 102 మంది ఋషుల పేర్లు.. 102 గోత్రనామాలు.. 25 చారిత్రక చిత్రాలు. 45 రోజుల శ్రమతో చేనేత మగ్గంపై ఆధ్యాత్మిక కళాఖండం. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: చేనేత మగ్గంపై దారం మాత్రమే కాదు.. చరిత్రను కూడా నేయవచ్చని మరోసారి నిరూపించారు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్. మగ్గంపై తనదైన సృజనాత్మకతతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఆయన.. తాజాగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి…

    Continue Reading

  • సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్‌ఎస్‌సీలో సిరిగిరి తేజస్విన్‌ వర్మ ఎంపిక
    , , ,

    సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్‌ఎస్‌సీలో సిరిగిరి తేజస్విన్‌ వర్మ ఎంపిక

    ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం. సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్‌ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్‌ఎస్‌సీ అధికారులు తేజస్విన్‌ వర్మకు ఆఫర్‌ లెటర్‌ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్‌ వర్మ…

    Continue Reading

  • హెల్త్ సబ్ సెంటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    హెల్త్ సబ్ సెంటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, టీజీఎంఎస్‌ఐడీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం నిధులతో నిర్మించిన 9 సబ్ సెంటర్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఒక సబ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో ఆరు…

    Continue Reading

  • వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మున్సిపల్, పోలీస్, ఎన్‌పీడీసీఎల్‌, ఆర్‌అండ్‌బి, రవాణా, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, నీటిపారుదల తదితర…

    Continue Reading

  • ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి:బీఆర్‌ఎస్‌ తోట ఆగయ్య
    , ,

    ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి:బీఆర్‌ఎస్‌ తోట ఆగయ్య

    ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకే దాడులు, దౌర్జన్యాలంటూ ఆరోపణలు. సిరివెలుగు, సిరిసిల్ల: శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తోట ఆగయ్య ఆరోపించారు. శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని…

    Continue Reading

  • తాతా మధును వెంటనే సస్పెండ్‌ చేయాలి: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుర దేవరాజ్
    , ,

    తాతా మధును వెంటనే సస్పెండ్‌ చేయాలి: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుర దేవరాజ్

    సిరిసిల్లలో కేసీఆర్‌, తాతా మధు దిష్టిబొమ్మల దహనం కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట. సిరివెలుగు, సిరిసిల్ల: తాతా మధును వెంటనే సస్పెండ్‌ చేయాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుర దేవరాజు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిరిసిల్ల కాంగ్రెస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీచౌక్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. దిష్టిబొమ్మల…

    Continue Reading

  • ఆయిల్‌పామ్‌తో రైతుకు రూ. లక్షల్లో ఆదాయం
    , ,

    ఆయిల్‌పామ్‌తో రైతుకు రూ. లక్షల్లో ఆదాయం

    ఏడెకరాల్లో 15 టన్నుల దిగుబడి. మరో రెండెకరాల్లో మామిడి, నిమ్మ సాగు. రైతు క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, ముస్తాబాద్: దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్‌ సాగుతో రైతు మంచి ఫలితాలు సాధించారు. ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసి నాలుగేళ్ల అనంతరం 15 టన్నుల దిగుబడితో రూ.3.45 లక్షల ఆదాయం పొందారు. రైతు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌…

    Continue Reading

  • గణేష్‌ వేడుకల్లో నిబంధనలు పాటించాలి. ఎస్పీ మహేష్‌ బి.గితే
    , ,

    గణేష్‌ వేడుకల్లో నిబంధనలు పాటించాలి. ఎస్పీ మహేష్‌ బి.గితే

    మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి. డీజేలకు అనుమతి లేదని స్పష్టం. సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సూచించారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి గణేష్‌ మండపాన్ని గణేష్‌ పోర్టల్‌–2026లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజా…

    Continue Reading

  • బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
    , ,

    బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

    గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు స్వీకరణ సిరివెలుగు, సిరిసిల్ల: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 33 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యలను చట్టపరంగా త్వరితగతిన…

    Continue Reading

  • సమస్యల పరిష్కారానికే ప్రజావాణి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    సమస్యల పరిష్కారానికే ప్రజావాణి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    ఐడీఓసీలో 190 దరఖాస్తులు.. మండలాల్లో 126 అర్జీలు సిరివెలుగు సిరిసిల్ల: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.…

    Continue Reading

error: Content is protected !!