వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మున్సిపల్, పోలీస్, ఎన్‌పీడీసీఎల్‌, ఆర్‌అండ్‌బి, రవాణా, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, నీటిపారుదల తదితర…

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మున్సిపల్, పోలీస్, ఎన్‌పీడీసీఎల్‌, ఆర్‌అండ్‌బి, రవాణా, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, నీటిపారుదల తదితర శాఖలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, జేసీబీలు, లైటింగ్‌, నీటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండపం వద్ద డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జనం జరిగే మార్గాల్లో విద్యుత్ తీగల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఎత్తు పెంచాలని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల నిర్వాహకులు తమ వివరాలను ఎన్‌పీడీసీఎల్‌ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్‌, లైటింగ్‌, క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు జాలర్లను అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖకు సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24 గంటలూ అంబులెన్స్‌లు, మందులు, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు సిద్ధంగా ఉంచాలని, సిరిసిల్ల జీజీహెచ్‌, వేములవాడ ఏరియా ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మండపాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి-ఎస్పీ మహేష్ బి. గితే.

జిల్లాలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. నిమజ్జనం రోజున నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కోరారు. ప్రతి మండపం వద్ద ప్లాస్టిక్ డ్రమ్‌లలో నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సిరిసిల్ల, వేములవాడ డివిజన్లతో పాటు ఆయా మండలాల పరిధిలో ఆర్డీవోలు, తహసీల్దార్లు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జనం అనంతరం రెండు, మూడు రోజుల పాటు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రాచారి, శ్రీనివాసులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎన్‌పీడీసీఎల్‌, పంచాయతీ, మత్స్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!