సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్‌ఎస్‌సీలో సిరిగిరి తేజస్విన్‌ వర్మ ఎంపిక

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం. సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్‌ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్‌ఎస్‌సీ అధికారులు తేజస్విన్‌ వర్మకు ఆఫర్‌ లెటర్‌ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్‌ వర్మ…

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం.

సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్‌ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్‌ఎస్‌సీ అధికారులు తేజస్విన్‌ వర్మకు ఆఫర్‌ లెటర్‌ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్‌ వర్మ చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అనంతరం ఏరోస్పేస్‌ రంగంలో తన ప్రతిభను చాటుకునే దిశగా కొనసాగుతున్న ఆయనకు ఇస్రోలోని వీఎస్‌ఎస్‌సీలో శిక్షణకు ఎంపిక కావడం కీలక మైలురాయిగా నిలిచింది. సిరిసిల్లకు చెందిన యువకుడు దేశంలోని ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. తేజస్విన్‌ వర్మ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన ఎంపిక జిల్లాలోని యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!