సమస్యల పరిష్కారానికే ప్రజావాణి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఐడీఓసీలో 190 దరఖాస్తులు.. మండలాల్లో 126 అర్జీలు సిరివెలుగు సిరిసిల్ల: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.…

ఐడీఓసీలో 190 దరఖాస్తులు.. మండలాల్లో 126 అర్జీలు

సిరివెలుగు సిరిసిల్ల: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో 6, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 4 దరఖాస్తులు స్వీకరించారు.

మండలాల్లో 126 అర్జీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. మండలాల వారీగా మొత్తం 126 దరఖాస్తులు అందాయి. బోయినపల్లి 24, చందుర్తి 2, ఇల్లంతకుంట 9, గంభీరావుపేట 8, కోనరావుపేట 5, ముస్తాబాద్ 12, రుద్రంగి 0, తంగళ్లపల్లి 32, వీర్నపల్లి 9, వేములవాడ అర్బన్ 2, వేములవాడ రూరల్ 11, ఎల్లారెడ్డిపేట 12 దరఖాస్తులు వచ్చాయి.

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి.

ప్రతి సోమవారం ఐడీఓసీతోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తమ సమస్యలపై అర్జీలను అందజేస్తే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!