సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

సిరివెలుగు, కరీంనగర్ : తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని విమర్శించారు.…

సిరివెలుగు, కరీంనగర్ : తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహించడం సరికాదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 17న హుజురాబాద్‌తో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో విమోచన దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!