Category: ప్రాంతీయ వార్తలు
-

సిరిసిల్లలో సీఎం పర్యటనతో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల గులాబీ నేతల్లో మొదలైన గుబులు. కల్వకుంట్ల భూ కబ్జాలపై ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా తీయాలి. ఈనెల 30న లక్ష మందితో సీఎం బహిరంగ సభ. సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ సక్సెస్ చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌన్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది…
-

కామారెడ్డి జిల్లా బిజెపి మహిళా ఇన్చార్జిగా సిరిసిల్ల మహిళా నేత
అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన వేముల వైశాలి. సిరివెలుగు, సిరిసిల్ల : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణానికి చెందిన సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలు వేముల వైశాలిని కామారెడ్డి జిల్లా మహిళా ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కామారెడ్డి…
-

8 వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సీఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య కౌంటర్
2,400 ఎకరాల స్వాధీనం వివరాలు చెప్పాలని డిమాండ్. ఆర్టీఐ ద్వారా వివరాలు కోరి, న్యాయపోరాటం చేస్తామని వెల్లడి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని, వాటిలో 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పందించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ…
-

ఆయుర్వేదంతో ఆరోగ్యకర జీవనం: పోషకాహారం, యోగా ప్రాధాన్యతపై అవగాహన
2, 14వ వార్డుల అంగన్వాడీ కేంద్రాల్లో ఆయుష్ శాఖ కార్యక్రమాలు. సిరివెలుగు సిరిసిల్ల : ఆరోగ్యకరమైన జీవన విధానానికి పోషకాహారం, యోగా, ఆయుర్వేదం ఎంతో దోహదపడతాయని ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలోని 2వ, 14వ వార్డుల అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారం, పోషక విలువలు, వాటి ద్వారా…
-

భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు. రైతులకు పరిహారం త్వరగా అందించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీ (ఆర్అండ్ఆర్) పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్అండ్ఆర్ పనుల పురోగతిపై సోమవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…
-

అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి: ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
ఐడీఓసీలో 172 దరఖాస్తులు.. ఆర్డీఓ కార్యాలయాల్లో 18. మండలాల నుంచి 59 అర్జీలు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు…
-

బాల సాహిత్య వికాసకారుడు గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం
తొలి ‘చాంద్ సితారె’ బాల సాహిత్య పురస్కారం ప్రదానం. ఖమ్మంలో ఘన సత్కారం.. 40 నిమిషాల పాటు కొనసాగిన అభినందన సభ. సిరివెలుగు సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహిత్య వికాస కార్యకర్త, రంగినేని పిల్లల పండుగ కన్వీనర్ గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం చాంద్ సితారె సంస్థ తొలి బాల సాహిత్య పురస్కారం ‘చాంద్ సితారె–2026’ ను ఆయనకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది.…
-

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు పోరాటం. బాపూజీ ఆశయాలను కొనసాగించాలి. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు. సిరివెలుగు, సిరిసిల్ల :తెలంగాణ కోసం, సమాజం కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమవారం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…
-

నేతన్నలకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చేనేత పరిశ్రమను బలోపేతం చేసి నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఆది శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు…
Latest News
You May Have Missed













