యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు సహించం: దాసరి దేవేందర్

కాలనీతో సంబంధం లేని వ్యక్తి బహిష్కరణ మాట సిగ్గుచేటు. సిరివెలుగు, వేములవాడ: యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తూ జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని వేములవాడ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు దాసరి దేవేందర్‌ అన్నారు. జర్నలిస్టు కాలనీని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ సందర్శించే కార్యక్రమాన్ని కొందరు బహిష్కరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారంపై ఆయన బుధవారం స్పందించారు. ప్రభుత్వ విప్‌ జర్నలిస్టు కాలనీ సందర్శన కార్యక్రమం వ్యక్తిగతమైనది కాదని, ఏ…

కాలనీతో సంబంధం లేని వ్యక్తి బహిష్కరణ మాట సిగ్గుచేటు.

సిరివెలుగు, వేములవాడ: యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తూ జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని వేములవాడ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు దాసరి దేవేందర్‌ అన్నారు. జర్నలిస్టు కాలనీని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ సందర్శించే కార్యక్రమాన్ని కొందరు బహిష్కరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారంపై ఆయన బుధవారం స్పందించారు. ప్రభుత్వ విప్‌ జర్నలిస్టు కాలనీ సందర్శన కార్యక్రమం వ్యక్తిగతమైనది కాదని, ఏ యూనియన్‌కు సంబంధించినది కూడా కాదని స్పష్టం చేశారు. కాలనీలో పట్టాలు పొందిన ప్రతి జర్నలిస్టు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, రాజకీయ కారణాలతో కొందరు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జర్నలిస్టు కాలనీతో సంబంధం లేని వ్యక్తులు బహిష్కరణ అంటూ మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కాలనీలోని స్థలాలు, పట్టాల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగి ఉంటే అధికారులు విచారణ జరపాలని కోరారు. కాలనీ అభివృద్ధికి యూనియన్లకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జర్నలిస్టు కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.టి. బాబు యాదవ్‌, ఉపాధ్యక్షుడు తుమ్మనపల్లి జనార్ధన్‌, సలహాదారు రాపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి దూలం రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!