మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల

ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ…

ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా చెప్పారు.

✅ నియోజకవర్గంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. గత సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలకు అనుగుణంగా పనుల్లో మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

✅ ప్రాజెక్టు ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.

✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని రోడ్డు భవనాల పనుల పనుల పురోగతిని సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ కనెక్టివిటీ, భవన నిర్మాణాలు, బ్రిడ్జీలు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!