
ఉద్యోగుల ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి భారీగా తరలిరావాలని జిల్లా ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సయ్యద్ జబీ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఉద్యోగులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో మహాధర్నాకు తరలివెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బి.సాగర్ ( టీజీవో ), గాజుల సుదర్శన్, రియాజ్, రాజు (టీఎన్జీవో), రాజు (యూటీఎఫ్), మోతిలాల్ (హెడ్మాస్టర్ సంఘం), సుధాకర్‌రెడ్డి, తిరుపతి (డిటిఎఫ్), శ్రీనివాస్‌రావు, కిషన్ (పిఆర్టియు), లక్ష్మణ్ (ఎస్టియు), కృష్ణప్రసాద్, నారాయణ (టిఆర్టిఎఫ్), లక్ష్మణ్, రాజ్‌కుమార్ (ఏఈఓఎస్), ప్రవీణ్ (పంచాయతీ సెక్రటరీలు), బలరాం, నారాయణ (పెన్షనర్స్), రాంనాథ్‌రెడ్డి, అంజయ్య (టిపిటిఎఫ్), శేఖర్ (లెక్చరర్ సంఘం) తదితరులు పాల్గొన్నారు.











