పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం: బిజెపి నేత ప్రతాప రామకృష్ణ

వేములవాడ మున్సిపల్‌ కార్మికులకు బీజేపీ నేతల సన్మానం. సిరివెలుగు, వేములవాడ: పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలో నిర్వహించిన మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని…

వేములవాడ మున్సిపల్‌ కార్మికులకు బీజేపీ నేతల సన్మానం.

సిరివెలుగు, వేములవాడ: పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలో నిర్వహించిన మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్‌, కుమ్మరి శంకర్‌, సంటి అంజిబాబు, చిక్కుడు మల్లేశం, సగ్గు రాహుల్‌, కట్కం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!