ఫలించిన బీజేపీ ధర్నా.. 700 ఎకరాలకు సాగునీరు విడుదల.
సిరివెలుగు, గంభీరావుపేట: ఎగువ మానేరు నీటి విడుదలతో రైతులకు ఊరట కలిగింది. ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు ఎగువ మానేరు నీటిని విడుదల చేయాలని రైతుల పక్షాన శనివారం బీజేపీ చేపట్టిన పోరాటానికి స్పందన లభించింది. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాకు ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదివారం దాదాపు 700 ఎకరాల వరిసాగుకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో బీజేపీ నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు పేల్చారు. రైతుల ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మలేష్ యాదవ్, ఉపాధ్యక్షులు ఏలేందర్, నాయకులు ఎల్లం అనిల్, సర్వోత్తమ్, నాగరాజు గౌడ్, దేవేందర్ యాదవ్, రాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ చారి, దేవరాజు, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.











