ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించడంతో పాటు డిగ్రీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 2 నుంచి 10 వరకు కొనసాగనుంది. వివరాల కోసం 8341387700 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.











