సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండుగ ప్రదీప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలైన దళిత ద్రోహి రసమయేనని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రసమయి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పండుగ ప్రదీప్ మాట్లాడారు. కేసీఆర్ బూట్లు నాకి రసమయి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, పదవిలో ఉన్నన్ని రోజులు దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి రసమయికి లేదని అన్నారు. ఎర్రవెల్లి పసుపు నీళ్ల వ్యవహారంపై రసమయి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రదీప్ తప్పుపట్టారు. అక్కడికి అస్సులు దళితులు రాలేదంటూ రసమయి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో రసమయి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే ఆధారాలతో సహా వివరాలు వెల్లడించనున్నారని తెలిపారు. ఇకనైనా రసమయి తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రసమయి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఈ సందర్భంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే రేలేదని హెచ్చరించారు. సమావేశంలో మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకన్న, నక్క నరసయ్య, కత్తెరపాక ఎల్లయ్య, పురుషాని నాగరాజు, బిగుల్లా విజయ్, రాపెల్లి శ్రీనివాస్, సంగేపు శ్రీనివాస్, నిరటి ప్రదీప్, ఎడ్ల తిరుపతి, బూత్కూరి అంజి, బోలగం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.











