న్యాయవాదిపై కౌంటర్ కేసు పెట్టడం సరికాదు: వేములవాడ బార్ అసోసియేషన్

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిరివెలుగు, వేములవాడ: సిరిసిల్లకు చెందిన న్యాయవాది బోదాసు రమేష్‌పై దాడి చేసి దుర్భాషలాడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, తిరిగి న్యాయవాదిపై కౌంటర్ కేసు నమోదు చేయడం సరికాదని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, మాజీ అధ్యక్షుడు గుడిసె సదానందం అన్నారు. మంగళవారం వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు…

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

సిరివెలుగు, వేములవాడ: సిరిసిల్లకు చెందిన న్యాయవాది బోదాసు రమేష్‌పై దాడి చేసి దుర్భాషలాడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, తిరిగి న్యాయవాదిపై కౌంటర్ కేసు నమోదు చేయడం సరికాదని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, మాజీ అధ్యక్షుడు గుడిసె సదానందం అన్నారు. మంగళవారం వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, కేసును రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కౌంటర్ కేసు నమోదు చేయడం న్యాయవాదుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. న్యాయవాది బోదాసు రమేష్‌పై నమోదు చేసిన కౌంటర్ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, రేగుల దేవేందర్, కందుల క్రాంతికుమార్, గడ్డం సత్యనారాయణరెడ్డి, నక్క దివాకర్, నాగుల సంపత్, మాదాసు దేవయ్య, బొజ్జ నరేష్, జెట్టి శేఖర్, వడ్లకొండ శ్రీకాంత్, ఉల్లెందుల అనిల్, గుడిపల్లి మహేష్, పొత్తూరు మల్లేశం, మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ, జక్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!