కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం

చెట్టును ఢీ కొట్టిన కారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. సిరివెలుగు, వేములవాడ: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 2 న శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయి బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి అలియాస్ కబడ్డీ మల్లారెడ్డి తన…

చెట్టును ఢీ కొట్టిన కారు.

ఆలస్యంగా వెలుగులోకి ఘటన.

సిరివెలుగు, వేములవాడ: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 2 న శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయి బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి అలియాస్ కబడ్డీ మల్లారెడ్డి తన స్వగ్రామం బండపల్లికి అర్థరాత్రి వేములవాడ నుండి కారులో తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో గల ఏనుగల్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. మల్లారెడ్డికి ఎలాంటి గాయాలు చోటు చేసుకోక పోవడంతో త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తున్న ఓ ప్రజా ప్రతినిధి గమనించి వెంటనే బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం, ఉప సర్పంచ్ ఇసాక్, సమీప బంధువు సందిల లక్ష్మారెడ్డి, అరుణ్ లకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే మల్లారెడ్డిని ఇంటికి తరలించి కారును అక్కడి నుంచి తొలగించారు. కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవం రోజున అర్ధరాత్రి వరకు గ్రౌండ్ లో ఉండడంతో మల్లారెడ్డి అలసి పోయినప్పటికీ అదే రాత్రి నిద్రమత్తులో కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంతో క్షణాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగినప్పటికీ మల్లారెడ్డి కబడ్డీ క్రీడలు ముగిసే వరకు వేములవాడ లోనే ఉంటూ క్రీడలు విజయ వంతం కోసం కృషి చేయడం గమనార్హం.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!