రీ సర్వేలో భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: భూభారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వేలో క్షేత్రస్థాయి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, లైసెన్స్డ్‌ సర్వేయర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో సర్వే కోసం 18 రోవర్‌ యంత్రాలు అందుబాటులో…

క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలి.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: భూభారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వేలో క్షేత్రస్థాయి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, లైసెన్స్డ్‌ సర్వేయర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో సర్వే కోసం 18 రోవర్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. రెవెన్యూ అధికారులు, లైసెన్స్డ్‌ సర్వేయర్ల బృందాలతో రీ సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ముందుగా గ్రామసభ నిర్వహించి రీ సర్వే ప్రక్రియ, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, సర్వే చేయనున్న భూముల వివరాలను ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. గ్రామ సరిహద్దుల సర్వేతో ప్రక్రియ ప్రారంభించి, రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారుల సమన్వయంతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, రీ సర్వేను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!