టీజీఎఫ్‌ఐ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక: రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్

నవంబర్ 1న పట్టణ నడిబొడ్డున జానపద జాతర. 33 జిల్లాల కళాకారులతో అంగరంగ వైభవంగా ఫోక్ నైట్. ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ. సిరివెలుగు,రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ (టీజీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నవంబర్ 1న సిరిసిల్లలో జానపద జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ తెలిపారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ తొలి ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక కానుందని వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని షాదీ ఖానాలో టీజీఎఫ్ఐ సభ్యులతో కలిసి మీడియా…

నవంబర్ 1న పట్టణ నడిబొడ్డున జానపద జాతర.

33 జిల్లాల కళాకారులతో అంగరంగ వైభవంగా ఫోక్ నైట్.

ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

సిరివెలుగు,రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ (టీజీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నవంబర్ 1న సిరిసిల్లలో జానపద జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ తెలిపారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ తొలి ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక కానుందని వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని షాదీ ఖానాలో టీజీఎఫ్ఐ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందుసంస్థ ప్రతినిధులు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జానపద కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఫోక్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల జానపద కళాకారుల పురిటిగడ్డ అని, తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాల్లో కళాకారులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ ని మించి ఫోక్ ఇండస్త్రి ఎదుగుతుందని జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. సినీ పరిశ్రమకు కల్పిస్తున్న తరహాలో జానపద కళాకారులకు కూడా ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. కళాకారుల సంక్షేమం, వారి కళను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. బతుకమ్మ, దసరా వేడుకల అనంతరం సిరిసిల్లలో జానపద పండుగను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కళాకారులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీఎల్ నాందేవ్, ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్, ప్రచార కార్యదర్శి ఆకునూరు దేవయ్య, కోశాధికారి గజ్వేల్ వేణు, రేలారే గంగా, సలహాదారు అంజన్న దరువు అంజన్న, శిరీష, నక్క శ్రీకాంత్, నాగలక్ష్మి, తెలు విజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!