శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్

వేములవాడ (రాజన్న సిరిసిల్ల) 04 సెప్టెంబర్ 2026: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు దేవస్థాన అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద…

వేములవాడ (రాజన్న సిరిసిల్ల) 04 సెప్టెంబర్ 2026: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు దేవస్థాన అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు, అర్చక స్వాములు వారికి వేదాశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా దేవస్థాన డీఈవో శ్రీ ప్రతాప నవీన్ ఎమ్మెల్యే స్వామివారి శేషవస్త్రం కప్పి సత్కరించగా, ఏఈవో నాగుల మహేష్ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఎం రాజేందర్, శివ సాయి, ఉద్యోగులు, అర్చక బృందం, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!