బాధితులకు సత్వర న్యాయం అందించాలి:ఎస్పీ మహేష్‌ బి. గితే

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి. డయల్‌ 112 కాల్స్‌పై తక్షణమే స్పందించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ముస్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కేసుల పురోగతి, పెండింగ్‌ దర్యాప్తులు, స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది పనితీరు, నేరస్తులపై నిఘాను సమీక్షించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి.

డయల్‌ 112 కాల్స్‌పై తక్షణమే స్పందించాలి.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ముస్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కేసుల పురోగతి, పెండింగ్‌ దర్యాప్తులు, స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది పనితీరు, నేరస్తులపై నిఘాను సమీక్షించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్‌ నేరాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్‌ అరెస్టుల పేరుతో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాత్రి వేళల్లో గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని తెలిపారు. డయల్‌ 112కు కాల్‌ వచ్చిన వెంటనే పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. తనిఖీల్లో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ జ్యోతి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!