మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే

సిరివెలుగు సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులను పూజించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ప్రశాంత…

సిరివెలుగు సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులను పూజించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ శాఖ సూచించిన గణేష్‌ పోర్టల్‌లో మండపాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!