Category: ప్రాంతీయ వార్తలు
-

సిరిసిల్ల డిపోలో ఐక్య కూటమి విజయోత్సవం
పదేళ్ల తర్వాత ఎన్నికలు. గుర్తింపు పత్రం అందజేతతో సందడి. సిరివెలుగు, సిరిసిల్ల: ఆర్టీసీలో పదేళ్ల తర్వాత నిర్వహించిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి (EU–TMU–NMU)కి గుర్తింపు లభించిన సందర్భంగా శనివారం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీఎంయూ జెండాను ఆవిష్కరించి, బాణాసంచా కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి అధికారిక గుర్తింపు పత్రం అందజేసిన సందర్భంగా…
-

వేములవాడలో వైభవంగా దేవీ నవరాత్రులు
కాలరాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజ. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 11 (లెవెన్) టైగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో శనివారం నవరాత్రుల ఏడో రోజు అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి గాజుల పూజ, కుంకుమార్చన, పుష్పార్చనతో పాటు…
-

బతుకమ్మ సంబరాల్లో జూనియర్ సివిల్ జడ్జి
సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కృష్ణా జిల్లా నందిగామ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, పట్టణ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తన పుట్టినిల్లు వేములవాడకు వచ్చి బతుకమ్మ ఆడుకోవడం ఎంతో…
-

సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం
కవల మగపిల్లల జననం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అరుదైన ఆనందకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని జూబ్లీ నగర్‌కు చెందిన ఊర్మిళ సాధారణ ప్రసవం ద్వారా కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ప్రసవం అనంతరం తల్లితో పాటు ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ సుచేతలక్ష్మి, డాక్టర్ సుగుణ పర్యవేక్షణలో డాక్టర్ ప్రతిభ ప్రసవం నిర్వహించారు. నర్సింగ్…
-

మూలవాగులో కొలువుదీరిన గౌరీదేవి!
వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ శోభాయాత్ర. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహ శోభాయాత్రను ఘనంగా నిర్వహించి, అనంతరం మూలవాగు వద్ద అమ్మవారిని కొలువుదీర్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల మీదుగా మూలవాగు వరకు కొనసాగింది. ప్రభుత్వ విప్,…
-

బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో విమలక్క బతుకమ్మ సందడి!
వేములవాడలో ఘనంగా ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు. బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు.. ప్రజా పోరాటాలకు ప్రతీక: విమలక్క. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, ఆటపాటల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క…
-

బిజెపి నేత రామకృష్ణ ఇంట్లో బతుకమ్మ వేడుకలు
సిరివెలుగు, వేములవాడ: పట్టణంలో శుక్రవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ఇంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణం లోని 28 వ వార్డు కౌన్సిలర్ ప్రతాప హిమబిందు తమ కుటుంబ సభ్యులతో కలసి బతుకమ్మ ను అందంగా అలంకరించి బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. Share this… Facebook Whatsapp Twitter Pinterest Linkedin
-

వేములవాడ సద్దుల బతుకమ్మలో విమలక్క సందడి
సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సందడి చేశారు. శుక్రవారం ఉదయం వేములవాడకు చేరుకున్న ఆమె, 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను అందంగా అలంకరించారు. అనంతరం పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది.…
-

గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ అటాచ్!
థర్డ్ డిగ్రీ ఆరోపణలపై డీఎస్పీ స్థాయి విచారణ. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌ను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఎస్ఐపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు ఎస్పీ…
Latest News
You May Have Missed













