‘ది ప్యారడైజ్’లో కేసీఆర్ రిఫరెన్స్

ప్రియదర్శి ‘శంకరన్న’ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ! సిరివెలుగు, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరోయిన్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే ఇందులోని కొన్ని సన్నివేశాలు, పాత్రలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాత్రలో ప్రియదర్శి లుక్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్…

ప్రియదర్శి ‘శంకరన్న’ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ!

సిరివెలుగు, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరోయిన్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే ఇందులోని కొన్ని సన్నివేశాలు, పాత్రలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాత్రలో ప్రియదర్శి లుక్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయని ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సినిమాలోని శంకరన్న పాత్ర సవారీలకు గుర్తింపు కోసం అండగా నిలిచే ఎమ్మెల్యేగా కనిపిస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన డైలాగ్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “సావు నోట్లో తలకాయ పెట్టేసినారే.. మీకు గుర్తింపు తీసుకొస్తా!” అన్న డైలాగ్‌పై నెటిజన్లు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. తెలంగాణ యాసతో పాటు రాజకీయ నాయకుడి తరహా హావభావాలు, డైలాగ్ చెప్పే విధానం ఈ పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే సమయంలో ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్‌తో పాటు సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రల ప్రస్తావన కూడా ఉందని తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రియదర్శి శంకరన్న పాత్రలో కనిపించగా, పి. విజయ్ కుమార్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలో కనిపించినట్లు సమాచారం. సినిమా విడుదలైన రోజే ఈ పాత్రలకు సంబంధించిన వీడియోలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ‘ది ప్యారడైజ్’లోని రాజకీయ రిఫరెన్స్‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!