మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ. సిరివెలుగు, సిరిసిల్ల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని, వారి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు,…

సిరిసిల్ల గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ.

సిరివెలుగు, సిరిసిల్ల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని, వారి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఈ రోజు ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం వసతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు హాస్టల్ లో వసతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం చదవాలని, అనుకున్న లక్ష్యం చేరుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!