కామారెడ్డి జిల్లా బిజెపి మహిళా ఇన్‌చార్జిగా సిరిసిల్ల మహిళా నేత

అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన వేముల వైశాలి. సిరివెలుగు, సిరిసిల్ల : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పారెడ్డి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణానికి చెందిన సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలు, రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలు వేముల వైశాలిని కామారెడ్డి జిల్లా మహిళా ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కామారెడ్డి…

అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన వేముల వైశాలి.

సిరివెలుగు, సిరిసిల్ల : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పారెడ్డి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణానికి చెందిన సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలు, రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలు వేముల వైశాలిని కామారెడ్డి జిల్లా మహిళా ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కామారెడ్డి జిల్లాలో మహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మహిళలను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!