Category: తాజా వార్తలు
-

మర్తనపేట అంగన్వాడీలో పోషన్ మహా కార్యక్రమం
తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన. సిరివెలుగు కోనరావుపేట: కోనరావుపేట మండలం ధర్మారం సెక్టార్ పరిధిలోని మర్తనపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహ కార్యక్రమంలో భాగంగా తల్లులకు పోషకాహారంపై అవగాహన నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కనకమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.సూపర్వైజర్ కనకమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎదుగుదలలో మొదటి వెయ్యి…
-

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
30న సీఎం రేవంత్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభం. హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. సిరివెలుగు, కరీంనగర్: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…
-

సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా చొప్పదండి ప్రకాష్?
ఆఖరిక్షణంలో మారిన సమీకరణాలు. మాజీ మండలాధ్యక్షులకే సింగిల్ విండో చైర్మన్ పదవులు! నేతలను వరించనున్న నామినేటెడ్ పోస్టులు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామీనేటెడ్ పదవుల పందెరం హిట్ పుట్టిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతుంది. అధికార పార్టీ అధిష్టానం ఈ నామినేటెడ్ పదవులను ఎవరికి కట్టబెడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కాక రేపుతుంది. చాలామంది ఆశావాహులు ఈ నామినేటెడ్ పదవులు ఆశిస్తుండగా, ఇప్పటికే…
-

వినాయకుడి వద్ద అన్నదానం ప్రారంభించిన కలెక్టర్
స్వయంగా వడ్డించిన గరిమ అగ్రవాల్. అధికారులతో కలిసి భోజనం. సిరివెలుగు, సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులకు భోజనం వడ్డించారు. అనంతరం అధికారులతో పాటు సిబ్బందితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ…
-

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ మహేష్ బి.గితే
హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలిన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఈ నెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే బుధవారం పోలీసు అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, హెలిప్యాడ్, పార్కింగ్ కోసం ఎంపిక చేయనున్న ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. వీఐపీ, వీవీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్,…
-

ముగ్గురు సిరిసిల్ల కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత
సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్లలోని ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై సస్పెన్షన్ వేటు అధిష్టానం ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోనె శరణ్య, బూర యాదగిరి, నల్ల శ్రావణ్ లు కౌన్సిలర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. సుమారు ఆరు నెలల పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారని, ఈ ముగ్గురిని అధిష్టానం ఆదేశాల మేరకు డిసిసి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం…
-

ట్రాఫిక్ నియంత్రణకు మెడికవర్ బారికేడ్లు
రూ.1.05 లక్షల విలువైన 15 బారికేడ్లు పోలీసులకు అందజేత. సిరివెలుగు, సిరిసిల్ల: ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతకు సహకరించే ఉద్దేశంతో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం సిరిసిల్ల పోలీసులకు 15 ట్రాఫిక్ బారికేడ్లను అందజేసింది. మంగళవారం సిరిసిల్ల పోలీస్స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో బారికేడ్లను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లను…
-

కుంగ్ఫూ, కరాటేలో సిరిసిల్ల విద్యార్థుల సత్తా
రాష్ట్రస్థాయి పోటీల్లో 3 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ పతకాలు. సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రస్థాయి కుంగ్ఫూ, కరాటే పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం టోల్గేట్ సమీపంలోని త్రినేత్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 20న నిర్వహించిన 6వ స్టేట్ లెవల్ కుంగ్ఫూ, కరాటే ఛాంపియన్షిప్–2026లో విద్యార్థులు కటా విభాగంలో పతకాలు సాధించారు. మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన…
-

మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
పెద్దబోనాలలో కూరగాయల సాగును పరిశీలన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రైతులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే నిరంతర ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలలో రైతు కాశెట్టి మల్లయ్య సాగు చేస్తున్న కూరగాయల తోటను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ వరి సాగును పక్కనపెట్టి సుమారు నాలుగు ఎకరాల్లో వంకాయ, మిరప, కాకరకాయ సాగు చేస్తున్న రైతును…
-

పోషకాహారంతోనే బంగారు భవితకు బాటలు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరివెలుగు, తంగళ్లపల్లి : పిల్లలకు చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. 9వ పోషణ మాసం సందర్భంగా ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమాన్ని మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషణ మాసం ప్రాధాన్యతను వివరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు,…
Latest News
You May Have Missed












