కుంగ్‌ఫూ, కరాటేలో సిరిసిల్ల విద్యార్థుల సత్తా

రాష్ట్రస్థాయి పోటీల్లో 3 గోల్డ్‌, 2 సిల్వర్‌, 1 బ్రాంజ్‌ పతకాలు. సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం టోల్‌గేట్‌ సమీపంలోని త్రినేత్ర గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సెప్టెంబర్‌ 20న నిర్వహించిన 6వ స్టేట్‌ లెవల్‌ కుంగ్‌ఫూ, కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో విద్యార్థులు కటా విభాగంలో పతకాలు సాధించారు. మాస్టర్‌ వోడ్నాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన…

రాష్ట్రస్థాయి పోటీల్లో 3 గోల్డ్‌, 2 సిల్వర్‌, 1 బ్రాంజ్‌ పతకాలు.

సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం టోల్‌గేట్‌ సమీపంలోని త్రినేత్ర గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సెప్టెంబర్‌ 20న నిర్వహించిన 6వ స్టేట్‌ లెవల్‌ కుంగ్‌ఫూ, కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో విద్యార్థులు కటా విభాగంలో పతకాలు సాధించారు. మాస్టర్‌ వోడ్నాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఈ. శివని (7వ తరగతి-బి), ఈ. రజినీకుమారి (6వ తరగతి-బి), జె. ఆర్య (6వ తరగతి-సి) గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. జి. వాణిశ్రీ (7వ తరగతి-బి), ఆనంది (7వ తరగతి-బి) సిల్వర్‌ మెడల్స్‌, జె. శిరియా (6వ తరగతి-బి) బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద హర్షం వ్యక్తం చేశారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శిక్షకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్‌, కుంగ్‌ఫూ మాస్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!