మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి : కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

పెద్దబోనాలలో కూరగాయల సాగును పరిశీలన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రైతులు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే నిరంతర ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దబోనాలలో రైతు కాశెట్టి మల్లయ్య సాగు చేస్తున్న కూరగాయల తోటను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ వరి సాగును పక్కనపెట్టి సుమారు నాలుగు ఎకరాల్లో వంకాయ, మిరప, కాకరకాయ సాగు చేస్తున్న రైతును…

పెద్దబోనాలలో కూరగాయల సాగును పరిశీలన.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రైతులు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే నిరంతర ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దబోనాలలో రైతు కాశెట్టి మల్లయ్య సాగు చేస్తున్న కూరగాయల తోటను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ వరి సాగును పక్కనపెట్టి సుమారు నాలుగు ఎకరాల్లో వంకాయ, మిరప, కాకరకాయ సాగు చేస్తున్న రైతును కలెక్టర్‌ అభినందించారు. ప్రస్తుతం వంకాయ దిగుబడి వస్తుండగా, పంట సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్‌, ఆదాయ వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. వంకాయ మొక్కలు నాటిన సుమారు 45 రోజుల నుంచి దిగుబడి ప్రారంభమై, దాదాపు ఆరు నెలల వరకు ప్రతి వారం పంట చేతికి వస్తుందని రైతు వివరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.2 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల పరిశీలన.

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని మెడికల్‌ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంగళవారం పరిశీలించారు. భవనం లోపల, బయట జరుగుతున్న పనులతో పాటు వివిధ కార్యాలయాలు, డార్మిటరీ, కిచెన్‌, సమావేశ మందిరం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన మిగిలిన పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవనం ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు. భవనంలో అవసరమైన ఇతర మౌలిక వసతులు, ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. పరిశీలనలో డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ మహేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!