కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

30న సీఎం రేవంత్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ ప్రారంభం. హెలిప్యాడ్‌, భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. సిరివెలుగు, కరీంనగర్‌: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…

30న సీఎం రేవంత్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ ప్రారంభం.

హెలిప్యాడ్‌, భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.

సిరివెలుగు, కరీంనగర్‌: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వీవీఐపీ భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, ప్రజల రాకపోకలు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించిన ప్రాంగణం, జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌తో పాటు సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం నూతన కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై దిశానిర్దేశం చేసి, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేష్‌ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!