బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను తిప్పికొడతాం:పిసిసి అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే గూటి పక్షులని ఏద్దేవా సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర అన్నారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం…

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే గూటి పక్షులని ఏద్దేవా

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర అన్నారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలను ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో కావాలనే కుట్రపూరిత చర్యలకు బీఆర్‌ఎస్‌ నాయకులు తెరలేపుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకే గూటి పక్షుల్లా వ్యవహరిస్తున్నాయని ఏద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, ఆ అవినీతి బయటపడుతుందనే భయంతోనే అసెంబ్లీలోకి వచ్చిన వెంటనే ఆందోళనలకు దిగుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గుండాగిరికి పాల్పడుతూ, మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితుల విషయంలో కేసీఆర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆలోచనా విధానాన్నే బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మోడీ రవిచంద్ర విమర్శించారు. శాసనసభ స్పీకర్‌ తల్లిని దూషించే స్థాయికి వెళ్లి, స్పీకర్‌ను కంటతడి పెట్టించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!