రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన ఐడీఓసీలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సిరివెలుగు, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

ఐడీఓసీలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష

సిరివెలుగు, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పనులు పూర్తయ్యే సమయంపై ఆరా తీశారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల వేగం పెంచేందుకు కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. తిప్పాపూర్‌ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులను కూడా పరిశీలించారు. మురుగునీటి కాలువ, విద్యుత్‌ టవర్లు, రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఐడీఓసీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌.. వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అధునాతన గోశాల నిర్మాణ పనులపై వివరాలు సేకరించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లానాయక్‌, డీఈ శాంతయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్‌, తహసీల్దార్‌ జయంత్‌, రాజన్న ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!