ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: తంగళ్లపల్లి ఎంఈఓ రాజు నాయక్

దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు. సిరివెలుగు, తంగళ్లపల్లి :దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో మండల స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిత సెంటర్‌ ఉపాధ్యాయురాలు బి. పద్మ…

దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు.

సిరివెలుగు, తంగళ్లపల్లి :దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో మండల స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిత సెంటర్‌ ఉపాధ్యాయురాలు బి. పద్మ ఆధ్వర్యంలో డ్రాయింగ్‌, రన్నింగ్‌, మ్యూజికల్‌ చైర్‌, క్యారమ్‌ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజు నాయక్‌ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలను ఇతరులతో పోల్చి వేరుగా చూడకుండా, వారిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించాలని సూచించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించి, ఆయా రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అవసరాలను గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. విద్యతో పాటు క్రీడలు, కళలు తదితర రంగాల్లోనూ దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మండల తహసీల్దార్‌ వి. మురళీకృష్ణ, మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌, తంగళ్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్‌ నారాయణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీలు, ఎంఆర్‌సీ సిబ్బంది, భవిత సెంటర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!