చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి…

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

అర్హత.. అనర్హత స్పష్టంగా నమోదు.

దరఖాస్తుదారుల నివాస స్థితి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన వారిని స్పష్టంగా గుర్తించడంతో పాటు.. అనర్హులైన దరఖాస్తులకు నిర్దిష్ట కారణాన్ని చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

ఏడు కేటగిరీలపై ప్రత్యేక పరిశీలన.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు సంబంధించిన దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, ఒంటరి మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు ఉండాలన్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరమని, గీత కార్మికులకు 50 ఏళ్ల వయసుతో పాటు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, గీత కార్మికుల సొసైటీలో సభ్యత్వం ఉండాలన్నారు. నేత కార్మికులకు 50 ఏళ్ల వయసు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ గుర్తింపు పత్రం అవసరమని, పైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ, డయాలసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలు పరిశీలించలన్నారు. దివ్యాంగులకు సదరం ధ్రువీకరణతో పాటు యూడీఐడీ పత్రం అవసరమని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సంతోష్, డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!