సిరిసిల్ల బస్టాండ్‌లో వ్యక్తికి తప్పిన ప్రమాదం!

స్వల్ప గాయాలతో వ్యక్తి సేఫ్‌. డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం. సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్ల పాత బస్టాండ్‌లో సోమవారం ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తగా బస్సును నడుపుతూ బస్టాండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టినంత పని చేశాడు. బస్సు బంపర్‌ అతడికి తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు కాగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన…

స్వల్ప గాయాలతో వ్యక్తి సేఫ్‌.

డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం.

సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్ల పాత బస్టాండ్‌లో సోమవారం ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తగా బస్సును నడుపుతూ బస్టాండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టినంత పని చేశాడు. బస్సు బంపర్‌ అతడికి తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు కాగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ప్రయాణికులు, పాదచారులు నడిచే సమయంలో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండగా, ఇలా నిర్లక్ష్యంగా బస్సులు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని ప్రయాణికులు మండిపడ్డారు. డ్రైవర్‌ను మందలిస్తూ ఇకపై బస్సును జాగ్రత్తగా నడపాలని సూచించారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ప్రతిరోజు బస్టాండ్ లో ఇలాగే డ్రైవర్లు బస్సులను అతివేగంగా, అజాగ్రత్తతో బస్సులను నడుపుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!